స్ట్రాంగ్‌రూమ్‌కు నా తాళాలు వేస్తా.. ధర్మపురి అరవింద్ - MicTv.in - Telugu News
mictv telugu

స్ట్రాంగ్‌రూమ్‌కు నా తాళాలు వేస్తా.. ధర్మపురి అరవింద్

April 15, 2019

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈవీఎంలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో మూడంచెల భద్రతలో భద్రంగా ఉన్నాయి. అయితే ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో ఫోటో దిగాడు. ఆ ఫోటో కాస్త వైరల్ కావడంతో ఆ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Nizamabad bjp candidate dharmapuri arvind seeks permission to put his own locks to strong rooms

ఈ నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ.. ఓ వింత కోరిక కోరాడు. తాను పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్ర పరచిన గదికి తనను తాళాలు వేసుకోనివ్వాలని కోరాడు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఉన్న భద్రతా పట్ల తనకు నమ్మకం లేదని అందుకే తన స్వంత తాళాలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు.