లాక్‌డౌన్ అమలులో కొంతమంది పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. విచక్షణా రహితంగా కొడుతున్న సంఘటనలు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్ఐ శ్రీహరి తనను, తన తండ్రిని గొడ్డును బాదినట్లు బాదాడని గండ్ల హరీశ్ అనే రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న తన తండ్రి రాజేందర్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లి = కొట్టారని హరీష్ తెలిపారు. ఇదేంటని అడగిన తనను కూడా చావబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు.
దీన్ని తీవ్రంగా పరిగణించి కమిషన్ ఏసీపీ ర్యాంక్ అధికారితో దర్యాప్తు జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేరసింది. లాక్ డౌన్ నుంచి వ్యవసాయంతోపాటు దాని అనుబంధ సంస్థలకు కూడా మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. అయితే కొందరు పోలీసులు అధికార మదంతో లాఠీలు ఝళిపిస్తున్నారు.