కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత

February 27, 2020

kavitha..

నిజమాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత దశాబ్దం నాటి కేసులో ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధన కాలంలో జరిగిన ధర్నాపై అప్పట్లో పోలీసులు ఈ కేసు పెట్టారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు  స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలని కవితకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె తన మద్దతుదారులతో కలసి ఈ రోజుకు కోర్టుకు వచ్చారు. కేసును విచారించిన జడ్జి.. రూ.10వేల బాండ్ సమర్పించి, వచ్చే నెల 19న తిరిగి కోర్టుకు రావాలని ఆమెను ఆదేశించారు. 

2010లో నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సమయంలో కవిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె దీన్ని నిర్వహించారు. అయితే ఇది చట్టవిరుద్ధమంటూ పోలీసులు ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.