అన్నదానానికి రెండేళ్లు.. 5 లక్షల మంది ఆకలి తీర్చిన కల్వకుంట్ల కవిత - MicTv.in - Telugu News
mictv telugu

అన్నదానానికి రెండేళ్లు.. 5 లక్షల మంది ఆకలి తీర్చిన కల్వకుంట్ల కవిత

November 8, 2019

అన్నదానం మహాదానం అని ఆదర్శాలు వల్లించడం వేరు, ఆచరణలో చూపడం వేరు. మన దేశంలో కడుపుకు పిడికెడు తిండి లేక కోట్లమంది అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా ఆకలి బాధలు తీరడం లేదు. వలస కూలీలు, ఇతర కార్మికుల పరిస్థితి మరింత దయనీయం. ఆస్పత్రికో, లేకపోతే మరో పనిపైనో వేరే ప్రాంతాలకు వెళ్లే పేదలు ఆకలి బాధ తీర్చుకోడానికి నానా ఇక్కట్లు పడతుంటారు. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో పది రూపాయలకు ఒక సమోసా మాత్రమే వచ్చే కాలం ఇది. 

mp kavita.

అలాంటి అన్నార్తుల క్షద్బాతను తొలగించడానికి రెండేళ్ల కిందట నిజమాబాద్ మాజీ ఎంసీ కల్వకుంట్ల కవిత పెద్ద మనసులో ముందుకొచ్చారు. 2017  నవంబర్ 8న తన సొంత డబ్బులతో నిజామాబాద్ పెద్దాసుపత్రిలో అన్నదానం ప్రారంభించారు. నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న పథకం పేదలకు నిజంగా అన్నపూర్ణలాగా మారింది. ఆస్పత్రి వద్దే కాకుండా పేదల విద్యార్థుల కోసం నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం దగ్గర కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు. బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రుల వద్దా ఈ కార్యక్రమం సాగుతోంది. 

మొక్కుబడిగా కాకుండా 

కవిత నిర్వహిస్తున్న అన్నదానం ఇప్పటి వరకు 5 లక్షల మంది ఆకలి తీర్చింది. నిజామాబాద్ ఆస్పత్రికి తెలంగాణ ప్రజలే కాకుండా, పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా రోగులు, వారి బంధులువు వస్తుంటారు. వారికి కడుపు నింపుకోవడం సమస్యగా మారింది. ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఓ రోజు ఆస్పత్రిని సందర్శించి వారి బాధలను స్వయంగా చూశారు. వారి ఆకలి బాధ తీర్చేందుకు సొంత ఖర్చుతో అన్నదానాన్ని మొదలుపెట్టారు. అది కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా రుచిలా ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజూ దాదాపు  900 మంది అక్కడ భోజనం చేస్తున్నారు. కవిత వీలైనప్పుడల్లా వారిని కలుసుకుని మాట్లాడుతుంటారు. అన్నదానంపై వారు సంతృప్తి వ్యక్తం చేయడంతో 2018 ఏప్రిల్ 26న కవిత బోధన్ ఆస్పత్రి వద్ద అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. అక్కడ రోజూ దాదాపు 350 మంది భోంచేస్తున్నారు. ఆర్మూర్ ఆస్పత్రి వద్ద  2018 జులై 5 నుంచి అన్నదానం మొదలైంది. అక్కడ రోజు 300 మంది పేదల కడుపు నిండుతోంది. 

అన్నదానానికి రెండేళ్లు.. 5 లక్షల మంది ఆకలి తీర్చిన కల్వకుంట్ల కవిత

Posted by Satyavathi Satya on Friday, 8 November 2019

కదలలేని వారికి.. 

ఈ అన్నదాన కేంద్రాల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. గర్భిణులు, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రోగుల దగ్గరకు వలంటీర్లు స్వయంగా వడ్డిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా గ్రంథాలయానికి రోజూ పేద విద్యార్థు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సమీప గ్రామాల నుంచి వచ్చే వీరికి మధ్యాహ్నం భోజనం ఇబ్బందిగా మారేది. దీంతో బిస్కెట్లు, టీలు తాగేవారు. వారి సమస్య గమనించిన కవిత 2018 జులై 15న అక్కడ అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ రోపూ 250 మంది విద్యార్థులు భోంచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 5 రూపాయల బువ్వలాంటి పథకాలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని వినతులు వస్తున్న నేపథ్యంలో కవిత స్వయంగా అన్నదానం చేస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.