ఐపీఎల్.. నిజామాబాద్ ఎమ్మెల్యే తనయుడి విశ్లేషణ - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్.. నిజామాబాద్ ఎమ్మెల్యే తనయుడి విశ్లేషణ

September 19, 2020

Nizamabad mla ganesh gupta bigala’s son Advaits Fourth Umpire IPL Analysis

ఐపీఎల్ సందడి మొదలైంది. కరోనా వైరస్ వల్ల క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలు బంద్ కావడంతో ఉసోరుమంటున్న జనం క్రికెట్ కోసం మళ్లీ టీవీల ముందు కూలబడుతున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో మ్యాచులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తనయుడు అద్వైత్ కూడా ఐపీఎల్‌పై తన విశ్లేషణలతో మీడియా ముందుకొచ్చాడు. 

లీగ్‌పై సమగ్ర విశ్లేషణలు అందిస్తానంటూ యూట్యూబ్‌లో ‘Advait The Fourth Umpire‘ పేరుతో అతడు చానల్ పెట్టేశాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సీజన్‌లో తన కుమారుడు ఐపీఎల్‌పై సమగ్ర విశ్లేషణ అందిస్తాడని తెలిపారు. అద్వైత్ విశ్లేషణ కోసం ఎదురు చేస్తున్నాంటూ అభిమానులు అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు. 

కాగ, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియంలలోకి మీడియాకు అనుమతి లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లను కవర్ చేయడానికి, ప్రెస్ మీట్లకు మీడియాకు అనుమతి ఉంటుంది.