అందరు ఎక్సైజ్ అధికారులు ఇలా ఉంటే... - MicTv.in - Telugu News
mictv telugu

అందరు ఎక్సైజ్ అధికారులు ఇలా ఉంటే…

June 7, 2017

ఎండకాలం వచ్చిదంటే బీర్లకు భలే డిమాండ్. హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ బీర్ కొట్టాల్సిందే. బీర్ డేట్ మారిందా..కల్తీదా.. మంచిదా అన్న సోయి ఉండదు.సీసా మీద సీసా దిగిందా లేదా అన్నదే లెక్క.. మందుబాబుల మీద ప్రేమో..డ్యూటీ అంటే డ్యూటీయోగానీ లిక్కర్ డిపో మీదపడ్డారు ఆ ఎక్సైజ్ అధికారులు. ఎందుకంటే…

పెగ్గు మీద పెగ్గు..బీర్ తర్వాత బీర్ తాగామా లేదా..కిక్కు ఎక్కిందా లేదా..తాగేటోళ్లకి కావాల్సింది ఇదే. మందు సీసా మీద లేబుల్ ఉన్నా చూడరు. చూసినా పట్టించుకోరు.పట్టించుకున్నా టేక్ లైట్. కానీ నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు అలా అనుకోలేదు. మాక్లూర్ ఐఎంఎల్ డిపోలో తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన బీర్లను పారబోశారు. పారబోసిన బీర్లు రూ. 16 లక్షల విలువ చేస్తాయి. రాష్ట్రంలో అందరు ఎక్సైజ్ అధికారులు ఇలాగే ఉంటే బాగుండు కదా..టెస్టీ..సూపర్ టెస్టీ బీర్లు దొరికేవి…