టర్కీలో చనిపోయిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ అలీఖాన్ ముకర్రం ఝా బహదూర్ పార్థివ దేహం మంగళవారం నగరానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో టర్కీ నుంచి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి చౌమొహల్లా ప్యాలెస్ కి తరలించారు. ఈ రోజు కేవలం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూడడానికి అనుమతిచ్చారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభిమానులు, సాధారణ ప్రజలకు అనుమతిస్తారు. అనంతరం చార్మినార్ పక్కనున్న మక్కా మసీదు వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. అక్కడున్న నిజాం పూర్వీకుల సమాధి పక్కనే పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. కాగా, ఇవాళ చౌమొహల్లాకు వెళ్లిన సీఎం కేసీఆర్.. నిజాంకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మరోసారి స్పష్టం చేశారు.