సిట్ విచారణ పూర్తయ్యేవరకు నో లోన్ ? - MicTv.in - Telugu News
mictv telugu

సిట్ విచారణ పూర్తయ్యేవరకు నో లోన్ ?

July 31, 2017

డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న టాలీవుడ్ హీరో నవదీప్ సిట్ విచారణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి హైదరాబాదులోని ఒక ప్రైవేటు బ్యాంకు పర్సనల్ లోను ఇవ్వడానికి నిరాకరించింది. కారణం తను సిట్ విచారణలో వున్నాడని. డ్రగ్స్ వ్యవహారం క్లియర్ అయిన తర్వాతే నవదీప్ కు ఏమైనా బ్యాంకు లోన్లు వంటివి దొరుకుతుండొచ్చని బ్యాంకు అధికారులు అంటున్నారు. నవదీప్ కు ఇది చాలా తలనొప్పి వ్యవహారంగా తయారైంది. తాజాగా అతను నటించిన సినిమా ‘ నేనే రాజు నేనే మంత్రి ’ ఆగస్టు 11 న విడుదలకు సిద్ధమౌతోంది. నవదీప్ వల్ల ఆ సినిమా మీద ఎలాంటి ప్రభావం పడకుండా వుంటే బావుండునని అనుకుంటున్నారు రాణా అభిమానులు.