మూడేళ్ల చిన్నారికి కుల, మత రహిత సర్టిఫికెట్ - MicTv.in - Telugu News
mictv telugu

మూడేళ్ల చిన్నారికి కుల, మత రహిత సర్టిఫికెట్

May 31, 2022

తమిళనాడులో ఓ జంట చేసిన పని సమాజానికి ఆదర్శంగా నిలిచింది. తమ మూడేళ్ల పాపకు ప్రభుత్వం నుంచి కుల, మత రహిత వ్యక్తిగా సర్టిఫికెట్ సాధించారు. కోయంబత్తూరు జిల్లా సంగనూరుకు చెందిన దంపతులు నరేష్ , గాయత్రిలకు మూడేళ్ల పాప ఉంది. అయితే పాపకు పాఠశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నించగా, దరఖాస్తులో కుల – మత కాలం పూర్తి చేయాల్సి వచ్చింది. తమ కూతురికి కులం, మతం అంటగట్టవద్దని సాధారణ పౌరురాలిగా అడ్మిషన్ ఇవ్వమని దంపతులు స్కూలు యాజమాన్యాన్ని కోరగా, వారు నిరాకరించారు. దీంతో నరేష్ దంపతులు జిల్లా కలెక్టర్‌ని ఆశ్రయించారు. తదుపరి కలెక్టర్ ఆదేశాలతో స్థానిక తహసీల్దార్ పాపకు ఈ నెల 27న కులం – మతం రహిత సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో కులం, మతం లేని చిన్నారిగా ఆ పాప నిలిచింది. కాగా, నరేష్ దంపతులు చేసిన పనిని అభ్యుదయవాదులు అభినందిస్తున్నారు.