No desire to act with that director: Chiranjeevi
mictv telugu

ఆ దర్శకుడితో నటించాలని కోరిక లేదు: చిరంజీవి

October 1, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఆగ్ర డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాల్లో ఒక్క సీన్‌లో నటించటం కోసం చాలామంది హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటువంటి డైరెక్టర్‌తో తనకు నటించాలని అంతగా కోరిక ఏమీ లేదని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా చిరంజీవి కథనాయకుడుగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యు ఇచ్చారు. అయితే, మొదటగా యాంకర్..’ మీరు రాజమౌళితో పనిచేయనని ఇటీవలే అన్నారు కదా ఎందుకు?’ అని ప్రశ్నించారు. దానికి చిరంజీవి స్పందిస్తూ..”రాజమౌళి గొప్ప దర్శకుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలిపారు ఆయన. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌లుక్ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. సినిమా తెరకెక్కించటానికి ఆయన ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పని చేయాలని, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని నాకు లేదు” అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఆ తర్వాత చిరంజీవి నవ్వుతూ..’నా ప్రతిభకు నా కుమారుడు, నటుడు రామ్ చరణ్ కొనసాగింపు’ అని, ఓ సినిమాకు దర్శకత్వం వహించాలి చాలా చాలా ఉంది’ అని ఆయన తెలిపారు.

ఇక, ‘గాడ్ ఫాదర్’ విషయానికొస్తే.. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు.