కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు: చిన్నజీయర్ స్వామి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు: చిన్నజీయర్ స్వామి

February 18, 2022

kcr

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ ఉత్సవాలకు ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్’ వేడుకలకు హాజరయ్యారు.

అయితే, కేసీఆర్ మాత్రం సమారోహం వేడుకలకు దూరంగా ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు కామెంట్స్ చేశారు. చిన్నజీయర్ స్వామితో దూరం పెరిగిందన్న ప్రచారం సాగింది. శుక్రవారం చిన్నజీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తమకు విభేదాలు ఎందుకుంటాయి. ఆయన సహకారంతోనే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మొదటి సేవకుడిని తానేనని సీఎం కేసీఆర్ అన్నారు. అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగా రాలేకపోయి ఉంటారు” అని చిన్నజీయర్ అన్నారు.

అంతేకాకుండా రాజకీయాల్లోనే ప్రతిపక్షాలు, స్వపక్షాలు ఉంటాయని, భగవంతుడి ముందు అంతా సమానమేనని ఆయన అన్నారు.