ఏపీ సరిహద్దుకు వస్తే 2 వారాల క్వారంటైన్.. డీజీపీ  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సరిహద్దుకు వస్తే 2 వారాల క్వారంటైన్.. డీజీపీ 

March 26, 2020

No entry in Telangana-AP Border .. Corona troubles for hostel students.

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వైరస్ సోకకుండా ఉండటానికే లాక్‌డౌన్ అని.. ఒకవేళ అనుమతిస్తే లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినట్టేనని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని తెలిపారు. ఏపీ బార్డర్‌కి ఎవరు వచ్చినా రెండు వారాలపాటు క్వారంటైన్‌కు పంపిస్తామని.. రెండు వారాల క్వారంటైన్ తర్వాతే తమ రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. సవాంగ్ మాట్లాడుతూ.. ‘బయటి వ్యక్తలను ఏపీలోకి అనుమతించబోం. ఎక్కడివారు అక్కడే ఉండాలి. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని ఆయన ప్రకటించారు.  

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్స్ యజమానులు ఖాళీ చేయాలని చెబుతున్నారు. దీంతో పాటు కూరగాయల ధరలు పెరిగాయని సరైన ఆహారం ఇవ్వడంలేదు. ఈ కష్టాలు ఎందుకని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆస్తకి చూపుతున్నారు. బుధవారం పెద్దఎత్తున తమకు పాస్‌లు అందివ్వాలని నగరంలోని ఆయా పోలీసు స్టేషన్లలో వారు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు సైతం పాసులను జారీ చేశారు. పాస్‌లు తీసుకుని ఇక్కడినుంచి వెళ్లినవారు ఏపీ సరిహద్దు వద్ద రానివ్వకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనిపై హోమంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ.. ‘తెలంగాణలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోది. ఎన్ఓసీలను పూర్తిగా నిలిపేస్తున్నాం. హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు ఎవరూ సొంతూళ్లకు వెళ్లొద్దు. అలా వెళ్లడం ద్వారా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. హాస్టల్స్ నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుంది. విద్యార్థులను హాస్టల్స్ ఖాళీ చేయాలని చెప్పొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే హాస్టల్స్ యాజమానులపై చర్యలు ఉంటాయి’ అని హోంమంత్రి తెలిపారు.