జనసేన సభ.. రాపాకపై పోస్టర్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన సభ.. రాపాకపై పోస్టర్ వైరల్

March 14, 2022

hbfghj

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో సోమవారం జరుగుతోంది. అందులో ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై వేసిన పోస్టర్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో రాపాక ఫోటో వేసి ‘ ఈ సభలోకి మీకు అనుమతి లేదు. ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జన సైనికులు’ అంటూ పేర్కొన్నారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన రాపాక, ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ముఖ్యమంత్రి జగన్‌కు అనేక విషయాల్లో మద్దతు తెలుపుతూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జన సేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఈ పోస్టర్ వేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.