కరోన వైరస్ కారణంగా ఈ చేప ప్రసాదం పంపిణీ రద్దు చేస్తునట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఈ విపత్కర సమయంలో తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు ఆయన అన్ని ప్రచార సంస్థలకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
యావత్ ప్రపంచ మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందినవార్ని అంతమొందిస్తున్న మహ్హమ్మారీ కరోనా ప్రభావానికి ఏమందూ లేదు…ప్రతి ఒక్కరూ దూరం పాటించడంతో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటమే రక్షణ అని ఆయన అన్నారు. ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని. ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తెలిపారు.