ఇక మెగా హీరోలకు ఆ తలనొప్పి లేదు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇక మెగా హీరోలకు ఆ తలనొప్పి లేదు..!

May 29, 2017


ఎక్కడ మెగా హీరోల ఫంక్షన్ జరిగినా పవన్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ రచ్చే. కొన్ని కొన్ని సార్లు స్టేజీపై ఉన్న మెగాస్టార్ ను సైతం వదిలేసి పవన్ కల్యాణ్ గురించి ఫ్యాన్స్ గోలగోల చేశారు. మా ఫంక్షన్ లో మీ రచ్చ ఏంటంటూ మెగా ఫ్యామిలీ హీరోస్ ఫైర్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆ తలనొప్పి వారికి ఉండబోదు. పవన్ ఫ్యాన్స్ రచ్చ ఉండనే ఉండదేమో..ఎందుకనుకుంటున్నారా…?
టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదు..ఇందులో నో డౌట్. అందుకే ఏ ఆడియా ఫంక్షన్ లోనైనా వీళ్ల లొల్లి ఉంటుంది. మెగాఫ్యామిలీ హీరోస్ వేడుకల్లోనైతే మరి టుమచ్. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు ఒకే దగ్గర కలుసుకునే రోజులు రాబోతోన్నాయి.

అన్నదమ్ములిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. టి సుబ్బరామి రెడ్డి వీరితో సినిమా తీయబోతున్నారు. ఇప్పుడు పవన్‌ త్రివిక్రమ్‌ సినిమా,చిరంజీవి ‘ఉయ్యాలవాడ’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తైన వెంటనే చిరు, పవన్‌ సినిమా మొదలుపెట్టనున్నారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే భారీ స్థాయిలో తెరకెక్కందట. డైరెక్టర్ త్రివిక్రమైతే హీరోయిన్లు ఎవరో చూడాలి.