హెల్మెట్ అడిగిన పోలీసును చెప్పుతో కొట్టాడు..వీడియో
#दिल थाम कर देखिये..#मेरठ में ट्रैफिक पुलिस के सिपाही से गाली-गलौज करने वाले #उस्मान अली को रोकने पर उसने सिपाही की चप्पल से धुनाई कर दी. थानेदार इस मामले में समझौता कराने पर आमादा है@Uppolice @meerutpolice @igrangemeerut @myogiadityanath @dgpup pic.twitter.com/z2SKiX5ItH
— Narendra Pratap| हिंदी पत्रकार (@hindipatrakar) August 24, 2019
రోడ్డు పైకి వెళ్లగానే కొందరు స్వేచ్ఛాజీవులు అయిపోతారు. తొక్కలో రూల్స్ అనుకుంటారేమో అస్సలు పాటించరు. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఆర్‌సీ లేదని వాళ్లు అడిగినప్పుడు మనం చెబుదాంలే అనుకుంటున్నారేమో. అలాంటి బాపతే ఈయన. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ ఏదని అడిగాడు. దీంతో అత్యంత అమానుషంగా సదరు పోలీసi;[ చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.
రద్దీ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్నారు. వారికి హెల్మెట్ లేదు. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బబ్లు కుమార్ వారిని ఆపి హెల్మెట్ ఏదని అడిగాడు. వారేదో చెప్పి అక్కడినుంచి వెళ్తూ ట్రాఫిక్ పోలీస్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడారు. దీంతో కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి వాహనం తాళం చెవి లాక్కోబోయాడు. వాహనదారుడు ఉస్మాన్ అలీ అడ్డుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ అతని చెంప వాయించాడు. అంతే అలీకి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే వాహనం దిగి తన చెప్పు తీసి కానిస్టేబుల్ పైకి దాడికి పాల్పడ్డాడు. కాసేపటివరకు వారిరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు కలుగజేసుకుని వీరిద్దరినీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి రాజీ కుదర్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. దీన్నంతా అక్కడే ఉన్న పలువురు విలేకరులు వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.