ఏపీలో ఈ నెల కూడా నిరాశే.. పెన్షన్ పెరగలేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఈ నెల కూడా నిరాశే.. పెన్షన్ పెరగలేదు..

August 1, 2020

No hike in pension in andhra pradesh

జగన్ అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. గత ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తున్న పింఛన్లను క్రమంగా మూడు వేల రూపాయలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఈ నెల కూడా పింఛన్ దారులకు నిరాశే ఎదురైంది. ఈ నెల నుంచి 2500 ఇస్తారని భావించారు.. కానీ రూ. 2250 మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల గ్రామ వాలంటీర్లు ఈరోజు ఉదయం నుంచి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. 

ఉదయం 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58.23 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. మొత్తం 61.28 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. ఈ నెల నుంచి కొత్తగా 2,20,385 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న పెన్షన్లను కూడా ప్రభుత్వం పెంచింది. వారికి వైఎస్సార్‌ కానుక కింద వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని పింఛన్ పంపిణీ చేస్తున్నారు.