కౌగిలింతలు, ముద్దులు వద్దు: చైనా - MicTv.in - Telugu News
mictv telugu

కౌగిలింతలు, ముద్దులు వద్దు: చైనా

April 7, 2022

nggn

”కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవద్దు” అంటూ చైనా ప్రభుత్వం షాంఘై నగరంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గతకొన్ని రోజులుగా షాంఘై నగరంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన చైనా ప్రభుత్వం..ప్రజలకు సంచలన హెచ్చరిక జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఎప్పుడు సందడిగా ఉండే షాంఘై నగరం వీధులన్నీ లాక్‌డౌన్ వల్ల బోసిపోతున్నాయి. వీధుల్లో కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రజలు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు. చైనా దేశంలోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్‌గా మారింది. దీంతో నగరంలోని 26 మిలియన్ల మంది నివాసితులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ”ఈ రాత్రి నుంచి జంటలు విడివిడిగా పడుకోవాలి, ముద్దు పెట్టుకోవద్దు, కౌగిలింతలు అనుమతించం, విడిగా తినాలి. ఆంక్షలు పాటిస్తున్నందుకు ధన్యవాదాలు” అని, ఇంటి కిటికీలను కూడా తెరవవద్దని కోరారు.

మరోపక్క భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ ముంబైలో నమోదైంది. దీంతో అధికారులు అది కరోనా వేరియంటా కాదా అని పరీక్షిస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా మళ్లీ వస్తుందా అని భయపడుతున్నారు.