తలపు తియ్యగానే కరిచేసి వెల్‌కమ్ చెప్పిన పాము - MicTv.in - Telugu News
mictv telugu

తలపు తియ్యగానే కరిచేసి వెల్‌కమ్ చెప్పిన పాము

May 8, 2019

పాములు పొదల్లోనో, నిర్మానుష్య ప్రాంతాల్లోనోవుంటాయిగాని ఇళ్లల్లో వుండవు. అడపాదడపా ఇళ్లల్లోకి అతిథుల్లా  వస్తుంటాయి. ఓ పాము ఇంట్లోకి రావడమే కాకుండా తలుపు చాటున కాపుగాచింది. ఇంట్లోకి వచ్చిన ఓ వ్యక్తిని గబుక్కున కాటేసింది. దీంతో అతను లబోదిబోమని బతుకుజీవుడా అని ఆస్పత్రికి పరుగెత్తాడు. ఈ ఘటన ఓక్లహోమాలోని లాటన్‌లో చోటు చేసుకుంది.

జెరెల్‌ హేవుడ్‌ అనే వ్యక్తి తన ఫ్రెండ్‌ రోడ్నీ కోప్‌ల్యాండ్‌ను చూడ్డానికి గత ఆదివారం అతని ఇంటికి వెళ్లాడు. వెళ్లి కోప్‌ల్యాండ్‌ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్‌ నొక్కాడు. అంతే ఒక్కసారిగా డోర్ చాటున వున్న పాము గబుక్కున అతనిమీదకు దాడి చేసింది. మెరుపువేగంతో వెళ్లి అతని కుడికన్ను పైన కాటేసింది. అంతే అతను షాకయ్యాడు. నొప్పితో విలవిలలాడుతూ సాయంకోసం అర్థించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే కోప్‌ల్యాండ్‌, హేవుడ్‌ను ఆస్పత్రికి తీస్కెళ్లాడు. ‘నా ఫ్రెండ్‌ని పాము కాటేయడం.. సీసీ కెమెరాలో చూసి షాకయ్యాను. హేవుడ్‌ని కరిచిన పాము విషపూరితమైంది కాదు. అతను కోలుకుంటున్నాడు’ అని కోప్‌ల్యాండ్‌ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం 5.5 అడుగులు వున్న ఆ పామును కొట్టి చంపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను చాలా మంది సోషల్ మీడియాలో చూసి కామెంట్లు చేస్తున్నారు. ఇళ్లల్లోకి ప్రవేశించేముందు చాలా జాగ్రత్తగా వుండాలని అంటున్నారు.

https://www.facebook.com/mashawn.copeland/posts/466107870828650