No latest printing of Rs 2,000 notes from 2019-2022
mictv telugu

రూ.2 వేల నోటు ఇక రాదా ?

November 9, 2022

No latest printing of Rs 2,000 notes from 2019-2022

ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 2016లో 2 వేల రూపాయల నోటును ప్రవేశపెట్టారు. రెండేళ్లు బాగా కనిపించినా ఈ నోటు తర్వాత పెద్దగా కనిపించడం మానేసింది. ఎక్కడో హవాలా డబ్బు దొరికినప్పుడు..దొంగ నోట్లలో తప్ప మరెక్కడా దర్శనం ఇవ్వలేదు. బ్యాంకులు, ATM లలో సైతం పెద్దగా కనబడిన దాఖలాలు లేవు. దీంతో ఈ పెద్ద నోట్‌ను రద్దు చేశారని కొందరు, తాత్కాలికంగా నిలిపివేశారని వార్తలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో 2 వేల రూపాయల నోటికి సంబంధించి ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఆర్టీఐ ద్వారా IANSఅడిగిన ప్రశ్నకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఓ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదని వెల్లడించింది.

మన దేశంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,54.991 మిలియ్ 2 వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.502 మిలియన్లకు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో 46.990 నోట్లు ప్రచురించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అదేవిధంగా దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్స్ నోట్లు సంఖ్య 2016-2020 మధ్య 2, 272 నుంచి 2,44,834 కు గణనీయంగా పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌లో సర్కార్ తెలిపింది. ప్రస్తుతానికి రెండు వేల రూపాయల నోటును రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు తెలిసినా.. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు మళ్లీ కనిపిస్తుందా లేదా చూడాలి.