no layoffs in our company : TCS
mictv telugu

ఎగిరి గంతులేసే వార్త చెప్పిన టీసీఎస్.. వారికి లైఫ్‌లో నో టెన్షన్

February 19, 2023

 no layoffs in our company : TCS

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం దెబ్బకు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తీసేస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ టెకీలు చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో ఎవ్వరినీ తొలగించడం లేదని ఉద్యోగులు ఎవరూ అలాంటి భయాలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చింది. అంతేకాక, లేఆఫ్‌లో భాగంగా విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని నియమించుకుంటామని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని కంపెనీ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్. సాధారణంగా టెక్ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒక్కసారి టీసీఎస్‌లో జాబ్ వస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టేనని భావిస్తారు.

దీన్ని ఆ కంపెనీ మరోసారి రుజువు చేసింది. ఒక్కసారి తమ కంపెనీలో ఉద్యోగులను నియమించుకుంటే తొలగించడం అంటూ ఉండదని, ఆశించినట్టు పని చేయకపోతే సరైన శిక్షణ ఇచ్చి మరీ పని చేసేలా చేస్తామని హెచ్ఆర్ వెల్లడించారు. ప్రస్తుతం టీసీఎస్‌లో 6 లక్షల మంది పని చేస్తున్నారని, గతంలో మాదిరే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. విదేశాల్లో సిబ్బందిని ఎక్కువగా నియమించుకున్నందువల్లే ఇప్పుడు తొలగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గతేడాది మొత్తం 2 లక్షల మందిని నియమించుకోగా వారిలో 1.19 లక్షల మంది ట్రైనీలేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది 40 వేల మంది ట్రైనీలను నియమించుకుంటామని తెలిపారు. దీంతో పాటు అమెరికాలోని తమ క్యాంపస్‌లో 70 శాతం మంది అమెరికన్ ఉద్యోగులు ఉన్నారని ఆ సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు.