బాలికల పాఠశాలల్లో పురుషులు బోధించవద్దు! - MicTv.in - Telugu News
mictv telugu

బాలికల పాఠశాలల్లో పురుషులు బోధించవద్దు!

October 20, 2019

No male teachers.

రాజస్థాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏండ్లలోపు ఉన్న పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువాలని నిర్ణయించింది. రాజస్థాన్ రాష్ట్రంలో బాలికల పాఠశాలల్లో ఈవ్ టీజింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా మీడియాకు వెల్లడించారు. 

బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లనే నియమించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒకవేళ మహిళా టీచర్లు సరిపోకపోతే 50 ఏండ్లకుపై వయస్సు ఉన్న పురుష ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. అయితే మంత్రి నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. యూనిసెఫ్ మాజీ పాలసీ ప్లానర్ కేబీ కొటారి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏండ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువడం చాలా సులభం. కానీ ఈ చర్య వల్ల దాదాపు 95 శాతం ఉన్న కో-ఎడ్యుకేషన్ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థినులు భయానికి లోనవుతారు. తాము వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని బాలికలు భయపడుతారు అని తెలిపారు.