Home > Featured > 'నో ముస్లిం స్టాఫ్'…చెన్నైలో బేకరీ యజమాని అరెస్టు

'నో ముస్లిం స్టాఫ్'…చెన్నైలో బేకరీ యజమాని అరెస్టు

‘No Muslim staff  Bakery owner in Chennai arrested.jp

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ సంఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన సంగతి తెల్సిందే. దీంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ కొందరు దుండగులు దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఓ బేకరీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో బేకరీ షాపు నిర్వహిస్తున్నాడు. తమ షాపులోని తినుబండారాలన్నీ జైన మతస్థులు మాత్రమే తయారు చేసినవేనని, తమ వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ‘వాట్సప్’ ద్వారా తమ వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు యజమానిని అరెస్ట్ చేశారు.

Updated : 10 May 2020 3:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top