నితీష్ గారేనా ఈ మాటన్నది..... - MicTv.in - Telugu News
mictv telugu

నితీష్ గారేనా ఈ మాటన్నది…..

August 1, 2017

రాజకీయాల్లో ఎల్లకాలం.. శత్రువులు, మిత్రులుండరని మరో సారి ప్రూవ్ అయింది. ఇన్నాళ్లు మోడీ పేరు చెప్పగానే   లావా… నిప్పులు కలిపి చెరిగే బీహార్ సిఎం నితీష్ కుమార్.. మోడీపై  ప్రశంషల వర్షం కురిపించారు. అంతే కాదు మోడీ లాంటి నాయకున్ని ఎదుర్కొనే నాయకుడే  దేశంలో లేడని చెప్పారు. ఆ ఏమిటిది…. నితీష్ గారేనా ఈ మాటన్నదని డౌటొద్దండి….. బీహార్ లో అన్నదమ్ముల బంధం బద్దలైన  తర్వాత   సిఎం నితీష్ మీడియాతో  మాట్లాడారు. ఇన్నాళ్లు తాను అన్నీ భరించానని ఇక భరించ లేక బద్దలయ్యానని కూడా చెప్పారు. అవినీతి రోపణలు సహించేది లేదన్నారు.

ఇంత వరకు బాగానే ఉంది. ఆర్జేడీతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తమది అన్నదమ్ముల బంధం అని ఇద్దరూ సెలవిచ్చుకున్నారు. ఇద్దరూ కల్సి మోడీపై అంతెత్తు ఎగిరి పడ్డారు. మహాకూటమి ఏర్పాటు  సందర్భంగా మొన్నటికి మొన్న నితీష్  యూటర్న్ తీసుకుని మోడీని కౌగిలించుకున్నారు.  మోడీ డిన్నర్ కు హాజరయ్య  మిత్రులకు గట్టిషాక్ ఇచ్చారు.  ఇప్పుడు లాలుకూ దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. అక్కడ బిజెపితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేశారు నితీష్.

ఆర్జేడీతో బంధం తెంపుకోవడంపై సొంత పార్టీ  నుండి బయటి నుండి ఎన్ని విమర్శలు వచ్చినా నితీష్ డోంట్ కేర్ అన్నారు.  డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ పై  వచ్చిన అవినీతి రోపణల తర్వాత  లాలూ, నితీష్ మధ్య మరింత గ్యాప్ పెరిగింది. తనకే కాదు ప్రభుత్వానికీ చెడ్డ పేరు వస్తుందని పసిగట్టిన నితీష్ బంధాన్ని తెంపేసుకున్నారు. మోడీ అస్సలు నాయకుడే కాదు అని చెప్పిన నితీష్  కళ్లకు మోడీ ఇప్పుడు పేద్ద నాయకుడిలా  కన్పిస్తున్నాడు. కాళ్ల కింద కుర్చీ కదిలిపోతుంటే… ఎవ్వరికైనా వాస్తవం బోధపడకుండా ఉంటుందా మరి.

మోడీకి కౌంటర్ గా నితీష్ ఎదుగుతారని అంతా అనుకున్నారు. ఈయనా అట్లాగే వ్యవహరించారు. లాలూ అండ దొర్కడంతో మూడో ఫ్రంట్ ద్వారా అదీ కాదంటే కాంగ్రెస్ తో కల్సి అయినా  పాలిటిక్స్  డ్రైవ్ చేద్దామని అనుకున్నారు. కానీ అవినీతి కొండను వెంటేసుకుని ఏమీ చేయలేమని  తర్వాత తెలుసుకున్నారు నితీష్.  లాలూను ఇంతలా ఇబ్బంది పెట్టడం వెనుక  ఏం జరిగిందో….ఏం జరుగుతున్నదో తెలియదు. కాక పోతే రాజకీయాల్లో మాత్రం ఎవ్వరూ ఎల్లకాలం మిత్రులు కాదు…శత్రువులూ కాదు.  బంధాలు అనుబంధాలు అన్నీ పవర్ చుట్టూ గిరిగీలు కొడ్తాయాంటే ఇదే కావొచ్చు.