ఇకపై అంతర్రాష్ట్ర ప్రయాణాలకు నో పాస్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై అంతర్రాష్ట్ర ప్రయాణాలకు నో పాస్‌

June 2, 2020

nvbn vbnh

ఈ రెండు నెలల నుంచి సొంతూళ్లకు వెళ్లాలంటే పోలీసుల నుంచి పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆన్‌లైన్‌లో లేదా, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అవసరమైన కాగితాలు సమర్పించి పాస్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు జారీ చేసే ట్రాన్స్‌పోర్ట్‌ పాసుల జారీని నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది.

అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటకకు ప్రయాణించే వారు మాత్రం అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాస్‌లు అడగడం లేదని స్పష్టంచేసింది.