ఆర్టీసీ చలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతి లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ చలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతి లేదు

November 8, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌ బండ్ కార్యక్రమానికి హైదరాబాద్ సిటీ పోలీసులు అనుమతి నిరాకరించారు. చలో ట్యాంక్ బండ్‌కు అనుమతి ఇవ్వాలంటూ అఖిల పక్షం నేతలు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్‌ని కలిశారు. 

Rtc

కాగా, ఆ కార్యక్రమానికి అనుమతివ్వలేమని ఆయన వెల్లడించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ట్యాంక్ బండ్‌పైకి ఎవరొచ్చినా అరెస్ట్‌ చేస్తామని స్పష్టంచేశారు. ఆర్టీసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల ముందస్తు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమతి లేకున్నా మిలియన్ మార్చ్ తరహాలో ట్యాంక్ బండ్‌పై నిరసన కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసి పిలుపునిచ్చింది. చలో ట్యాంక్ బండ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రేపు ఏం జరగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.