'ఎక్స్‌ఈ'తో ఎలాంటి ప్రమాదం లేదు: ఎన్‌.కే ఆరోడా - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎక్స్‌ఈ’తో ఎలాంటి ప్రమాదం లేదు: ఎన్‌.కే ఆరోడా

April 11, 2022

bfgnbfg

దేశవ్యాప్తంగా గతకొన్ని నెలలుగా కరోనా తగ్గుముఖం పడడంతో ప్రజలు పూర్తిగా సాధారణ జీవితాలకు అలవాటుపడ్డారు. ఇటువంటి సమయంలో గతకొన్ని రోజుల క్రితం గుజరాత్, మహారాష్ట్రలో కరోనా కొత్తవేరియంట్ ‘ఎక్స్ఈ’ తొలికేసు నమోదైందని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్లీ కరోనా వచ్చిందా? మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్ పెడతారా? అనే భయాందోళనకు గురైయ్యారు. ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా అనేక అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో ‘ఎక్స్ఈ’ కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వం ఈ ‘ఎక్స్ఈ’ వల్ల ప్రజలకు ఏమైనా హాని జరుగుతుందా? ఈ కొత్తవేరియంట్ ప్రమాదమైనదా? కాదా? అనే విషయాలపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టింది. అయితే, సోమవారం ఈ వేరియంట్‌కు సంబంధించి తాజా వివరాలను నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ ఎన్‌.కే ఆరోడా వెల్లడించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.

ఎన్‌.కే ఆరోడా మాట్లాడుతూ.. ”ఈ ‘ఎక్స్‌ఈ’ వేరియంట్ తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. వేగంగా వ్యాప్తి చెందుతుందనడం పైనా ఎటువంటి సమాచారం లేదు. ఓమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఎక్స్ఈతోపాటు ఇతర రకాలు కేవలం ఎక్స్ సిరీస్‌లో భాగమే. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయి. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్‌లో ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇటువంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదు’ అని ఆయన తెలిపారు.