బ్యాంకుల్లో డబ్బులు భద్రమేనా…
డబ్బులు బ్యాంకులో ఉంటే సేఫ్. జేబుల్లో , ఇంట్లో ఉంటే దొంగల భయం. బ్యాంకులో ఉంటే ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు.కానీ అన్ని సార్లు సేఫ్ కాదు. బ్యాంకే కదా అని బిందాస్ గా ఉంటే..ఏం జరిగిందో తెలుసా…
ఆ బ్యాంకు ఆకౌంట్ల హ్యాక్ జరగలేదు.. ఎవరూ విత్ డ్రా చేయలేదు.. కానీ ఖతాలో డబ్బు పోయింది. ది బ్యాంక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ ఐలాండ్స్‌లో ఇది జరిగింది. కస్టమర్ల ఖాతాల్లో కొందరివి జీరో బ్యాలెన్స్ అయితే ..మరికొందరికి డబుల్ , త్రిబుల్ ఫిగరైంది. నాలుగు వేల పెసోల నుంచి లక్ష పెసోల వరకు తమ ఖాతాల నుంచి అదృశ్యమైనట్లు పలువురు వినియోగదారులు సోషల్‌మీడియాలో వెల్లడించారు. మెసేజ్ లు చూసుకున్న లక్షలాది షాక్ తిన్నారు. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇది హ్యాక్ కాదని అంతర్గత సాంకేతిక సమస్య ,మరికొన్ని గంటల్లోనే కచ్చితంగా లావాదేవీలను సవరిస్తామని, అప్పటి వరకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా మనీలా స్టాక్ మార్కెట్లలో బీపీఐ షేరు ఒక శాతం కుంగింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే బ్యాంకుల్లో కూడా డబ్బు భద్రం కాదని…