తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దు: ఆర్కే సెల్వమణి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దు: ఆర్కే సెల్వమణి

May 5, 2022

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భర్త తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్‌లలో సినిమా షూటింగులు చేవొద్దని, తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో సినిమా షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

సెల్వమణి మాట్లాడుతూ..”తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు తమిళనాడులో కాకుండా పక్క రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్‌లలో షూటింగులు చేస్తున్నారు. దాని వల్ల తమిళ సినీ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. కథ డిమాండ్ చేస్తే, షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదు. కానీ, భద్రతను సాకుగా చూపిస్తూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం కరెక్ట్ కాదు. కావున పక్క రాష్ట్రాల్లో షూటింగులు ఆపేయండి” అని ఆయన అన్నారు. తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలనే తమ విన్నపం పట్ల హీరో విజయ్, అజిత్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.