no situation in which Hindu festivals can be celebrated peacefully in Telangana, Bandi Sanjay
mictv telugu

హుస్సేన్‌సాగర్‌లో అడ్డుకుంటే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తాం

September 5, 2022

తెలంగాణ రాష్ట్రంలో హిందూవుల పండుగలను ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిమజ్జనానికి గడువు సమీపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నిబంధనల పేరుతో హిందూ పండగలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో వినాయక విగ్రహల ఎత్తు, పర్యావరణం నిబంధన పేరుతో నిమజ్జనాకికి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయపోతే వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశం మారుతుందన్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం మొదల్కొని అన్నింటిని ప్రగతిభవన్‌కు తీసుకొచ్చి అక్కడే నిమజ్జనం చేయాల్సి వస్తుందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్‌కి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మెప్పు కోసం టీఆర్ఎస్‌ ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వానికి సూచించారు.

కాగా బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. వినాయకుడికి 20 కేజీల లడ్డూను సమర్పించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బండి సంజయ్, తరుణ్ చుగ్ ను ఘనంగా సన్మానించారు.