పిల్లల గురించి నో టెన్షన్.. మూడు చుక్కల రక్తంతో 50 రోగాల గుర్తింపు… - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల గురించి నో టెన్షన్.. మూడు చుక్కల రక్తంతో 50 రోగాల గుర్తింపు…

October 12, 2018

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతుంటారు. లేత శరీరం కావడంతో వారిలో వున్న రుగ్మతలను పసిగట్టడం చాలా కష్టం. వారు  

పెరుగుతూ, వ్యాధి ముదిరిన తరువాతే జబ్బు గురించి తెలుస్తుంది. అప్పుడు పిల్లలను ఎంత కాపాడుకుందామన్నా వాళ్లు తల్లిదండ్రలకు దక్కరు. ఇప్పటికి చాలామంది పిల్లలు అనేక రోగాల బారినపడి చనిపోయారు. కన్నవాళ్ళకు కడుపుకోత మిగిల్చారు. మరి దీనికి పరిష్కారమే లేదా అని చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.No tension about the child .. Identification of 50 diseases with three drops of blood …చాలాకాలం తర్వాత ఇందుకు పరిష్కారం దొరికింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘డ్రై బ్లడ్ స్పాట్’ పరీక్షలో భాగంగా బిడ్డ పుట్టగానే మూడు చుక్కల రక్తం తీసుకుంటారు. ఆ రక్తానికి పరీక్షలు నిర్వహిస్తారు. మూడు రోజుల్లోనే 50 వరకు రోగాలను గుర్తిస్తారు. ఈ తరహా పరీక్షలు తొలిసారిగా హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చిందని బర్త్‌ప్లేస్ ఆసుపత్రి వైద్యుడు రాజేష్ ఖన్నా వెల్లడించారు.

ఈ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో  కేరళ, తమిళనాడు, గోవాలలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.