ఆ ఫోన్లలో 30 తర్వాత వాట్సాప్ పనిచేయదట... - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఫోన్లలో 30 తర్వాత వాట్సాప్ పనిచేయదట…

June 5, 2017

ఇప్పుడు 4జీ స్టార్ట్ ఫోన్..వాట్సాప్, ఫేస్ బుక్,ట్విట్లర్ మస్ట్. పొద్దున లేచేస్తే గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి పడుకోబోయే దాకా గుడ్ నైట్ వరకు అంతా వాట్సాప్ ధునియా. అధికారిక సమాచారమైనా..అనధికారిక సమాచారమైనా..పెళ్లి పిలుపైనా..ఫంక్షన్ ఏదైనా అంతా వాట్సాప్ ఆహ్వానాలే.. అస్సలు వాట్సాప్ లేకుంటే..అమ్మో ఊహించడమే కష్టం..కానీ జూన్ 30 తర్వాత ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట..ఇంతకీ ఆ ఫోన్లు ఏంటీ…?

జూన్ 30 త‌రువాత వాట్సాప్ సేవ‌లు నిలిచిపోనున్నాయట. అన్ని ఫోన్ల‌లో కాదు. కేవ‌లం కొన్ని ఫోన్ల‌లో మాత్ర‌మే.ఈ వార్తలో ఎంత నిజం ఉందో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోన్లు ఇవే నంటూ పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు. షేర్ ల కొద్ది షేర్ లు చేస్తున్నారు. ఆ ఫోన్ల లిస్టులో బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్‌40, నోకియా సింబియన్‌ ఎస్‌60, ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2, విండోస్‌ ఫోన్‌ 7.1, ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్ 6 ఫోన్లు, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌లో జూన్ 30 త‌రువాత వాట్సాప్ ప‌నిచేయ‌దట. క‌నుక ఈ ఫోన్ల‌ను వాడుతున్న వారు కొత్త ఫోన్‌కు లేదా కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు అప్‌గ్రేడ్ కావాల‌ని వాట్సాప్ ఇప్ప‌టికే సూచించిందట.ఈ ఫోన్లు కాకుండా మిగిలిన ఫోన్ల‌ను వాడుతున్న వారు య‌థావిధిగా జూన్ 30 త‌రువాత కూడా వాట్సాప్‌ను వాడుకోవ‌చ్చ‌ని, వారు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదట. ఇప్పుడే ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. ఎంతవరకు నిజమోకానీ.. చక్కర్లు కొడుతుంది. వాట్సాప్ మేనేజ్ మెంట్ అధికారికంగా స్పందిస్తేగానీ నమ్మలేం.