భారతీయ దంపతులకు నోబెల్ బహుమతి..  - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ దంపతులకు నోబెల్ బహుమతి.. 

October 14, 2019

ప్రతిష్టాత్మక నోబెట్ బహుమతి చాలా కాలం విరామం తర్వాత భారత్ మేధను వరించింది. ఆర్థిక శాస్త్రంలో భారతీయ దంపతులతోపాటు మరొకరికి కలిపి మొత్తం ముగ్గురికి ఈసారి సంయుక్తంగా అవార్డును ప్రకటించారు. అంతర్జాతీయంగా పేదరికాన్ని తొలగించేందుకు చూపిన పరిష్కారాలను ప్రతిపాదించిన అభిజిత్‌ బెనర్జీ(58), ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో(47), మైకేల్‌ క్రెమెర్‌లకు బహుమతిని ప్రకటించారు. పేదరికంపై వారి పరిశీలను ఆశావహంగా ఉన్నాయని, కొత్త ఆలోచనలకు పురిగొల్పారని ఎంపిక కమిటీ కొనియాడింది. ‘రెండుదశాబ్దాలుగా సాగుతున్న వారి పరిశోధనలు, ప్రయోగాల వల్ల ఆర్థిక శాస్త్రం అభివృద్ధి చెందింది. పేదరికాన్ని అంతమొందించడానికి అవి సాయపడ్డాయి..’ అని పేర్కొంది. 

కోల్‌కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ జేఎన్‌యూ, హార్వర్డ్ వర్సిటీల్లో చదువుకున్నారు. 1988లో పీహెచ్డీ చేసిన ఆయన ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో ఎకనామిక్స్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య ఎస్తర్‌తో కలసి పేదరిక నిర్మూలనపై అధ్యయనం చేశారు. ఫ్రాన్స్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన ఎస్తేర్ నోబెట్ ఆర్థిక శాస్త్ర బహుమతిని అందుకున్న పిన్నవయస్కుల్లో రెండో వారు. వీరితోపాటు బహుమతికి ఎంపికైన క్రేమర్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కే చెందిన ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ కు 1998లో నోబెల్ బహుమతి రావడం తెలిసిందే. 

Nobel