Nobel laureate aung san suu kyi sentenced to five years in prison for bribery
mictv telugu

లంచం కేసులో నోబెల్ గ్రహీతకు ఐదేళ్ల జైలు శిక్ష

April 27, 2022

Nobel laureate aung san suu kyi sentenced to five years in prison for bribery

మయన్మార్ (బర్మా) దేశ కోర్టు హక్కుల కార్యకర్త, నోబుల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 6 లక్షల డాలర్లు నగదు, 11.4 కిలోల బంగారం లంచం రూపంలో తీసుకున్నట్టు నిర్ధారణ అయినందున శిక్ష విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. గతంలో సూకీపై 11 కేసులు మోపగా, అందులో ఇది మొదటిది. ఇంకా పది కేసులు విచారణలో ఉన్నాయి. అందులో కూడా నేర నిరూపణ అయితే సూకీకి మరింత శిక్ష పడే అవకాశముంది. కాగా, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నందుకు అంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి అవార్డు వరించింది. ఇదిలా ఉండగా, 1989 నుంచి 2010 వరకు 15 ఏళ్లపాటు సూకీ గృహ నిర్బంధంలో ఉంది.