బుల్లితెర బిగ్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికి ఆరు సీజన్స్ పూర్తయ్యాయి. ఒక ఓటీటీ కూడా. అయితే గత సీజన్ ఫెయిల్యూర్ వల్ల ఈసారి కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారని టాక్.
బిగ్ బాస్ 6 తెలుగు మిగతా సీజన్లతో పోలిస్తే సక్సెస్ కాలేదనే చెప్పాలి. వీకెండ్ షోలు కూడా బోరింగ్ గా సాగాయి. దీంతో బిగ్ బాస్ 7 మాత్రం అదిరిపోయే లెవల్ లో చేయాలని ఆ టీమ్ డిసైడ్ అయిందట. ఇప్పటికే బిగ్ బాస్ సెట్ వేయడం ప్రారంభమైందంటూ నెట్టింట కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి అది నిజమో, కాదో ఇంకా తెలియాల్సి ఉంది.
ఓకే చెప్పేసిందా..?
బిగ్ బాస్ త్వరలో అని చెప్పగానే.. తెర మీదకు కొందరి పేర్లు వచ్చేస్తాయి. అందులో ఈసారి మొదటిగా వచ్చిన పేరు రష్మీ గౌతమ్. గత కొన్ని సీజన్లలో కూడా ఈ అమ్మాయి పేరు వినపడింది. కానీ ఈసారి చాలా పెద్ద మొత్తంలో ఈమెకు ముట్ట చెప్పడానికి టీమ్ రెడీ అయిపోయిందట. ఎందుకంటే రష్మీ షోలు, ఈవెంట్స్ ఇలా చాలా ప్రోగ్రాములు చేస్తుంటుంది. ఆమె సంపాదన కూడా ఎక్కువే. దీంతో వారానికి 7లక్షలు ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ టీమ్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి రష్మీ కూడా ఓకే చెప్పినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ జంటలు..
రష్మీతో పాటు మరొక విడాకుల జంట ఈసారి వినపడుతున్నది. అదెవరో కాదు.. బిగ్ బాస్ 4లో రేలంగి మామయ్యగా పేరు తెచ్చుకున్న నోయెల్, అతని మాజీ భార్య ఎస్తేర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఈ జంటను బిగ్ బాస్ లోకి పంపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీరు కాకుండా.. ఈ మధ్యే పెండ్లి అయిన అమరదీప్, తేజస్విల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో వారు ఒక ఇంటర్వ్యూలో తమని ఏ బిగ్ బాస్ టీమ్ సంప్రదించలేదని తెలిపారు. చివరగా.. అసలు వీళ్లంతా కాదు.. మొత్తంగా పదకొండు జంటలను ఈసారి బిగ్ బాస్ షోలోకి ప్రవేశపెడుతున్నారనే వార్త కూడా చక్కర్లు కొడుతున్నది. మరి ఏదైనా సరే సెప్టెంబర్ వరకు ఆగితేనే అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ 7 మొదలుకాబోతుందట.