బైక్‌పై అడ్డగోలు స్టంట్లు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు స్టంట్లు చేస్తుండగా వీడియో తీసిన మరో ఇద్దరికీ సంకెళ్లు వేసి సెల్లో వేశారు. యూపీలోని నోయిడాలో ఓ కుర్రాడు… బైక్‌పై వెళ్తూ… సడెన్‌గా కాళ్లు పైకి లేపి… వెనక్కి పెట్టి.. బైక్‌పై పడుకున్నట్లుగా స్టంట్ చేశాడు. నడిరోడ్డు శక్తిమాన్ లాగా ప్రమాదకర విన్యాసాలు చేసినందుకు అతడితో పాటు… అతని ఇద్దరు ఫ్రెండ్స్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీడియో రికార్డ్ చేసినందువల్ల ఆ నేరంలో వాళ్లకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి… ఎవరైనా స్టంట్ చేస్తున్నప్పుడు… దాన్ని సపోర్ట్ చేస్తూ వీడియో తీయడం కూడా నేరమే అవుతుందని, ఆ స్టంట్‌ని పరోక్షంగా వారు సమర్థించినట్లు అవుతుందన్నారు. ఈ కేసులో స్టంట్ చేసిన కుర్రాడు వికాస్. వీడియో రికార్డ్ చేసిన ఫ్రెండ్స్ గౌరవ్, సూరజ్. సెక్టార్ 63 పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. బైక్‌ని సీజ్ చేసినట్లు ట్విట్టర్లో తెలిపారు.
बाइक पर खतरनाक स्टंट करने वाले युवक विकास तथा वीडियो बनाने वाले उसके 02 साथियों (गौरव, सूरज) को थाना सेक्टर-63 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त बाइक को सीज किया गया।#UPPolice pic.twitter.com/d94nvcfK01
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 28, 2022