ఓరి నీ వేషాలో.. బయట తిరగడానికి డాక్టర్ అవతారమెత్తి..   - MicTv.in - Telugu News
mictv telugu

ఓరి నీ వేషాలో.. బయట తిరగడానికి డాక్టర్ అవతారమెత్తి..  

April 4, 2020

Noida Man Jailed For Dressing Up As Doctor To Bypass Lockdown

లాక్‌డౌన్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కి పోతోంది. తిరిగే కాలు, తిట్టే నోరూ ఊరకే ఉండవు కదా. ఇంట్లో ఉండీ ఉండీ ఉండీ.. పిచ్చెత్తిపోయిన ఓ కుర్రాడు బయటికి వెళ్లడానికి సూపర్ ఐడియా కనిపెట్టాడు. లేబొరేటరీ సిబ్బంది వేసుకునే తెల్లకోటును సంపాదించాడు. చేతులకు గ్లవుజులు, ముఖానికి మాస్క్ పెట్టుకుని ‘పక్కా డాక్టర్ వేషం’ వేసి రోడ్డెక్కాడు. పోలీసులు మరీ అంత అమాయకులేమీ కాదు కదా. అబ్బాయి వాలకం తేడాగా ఉండడంతో ఆరా తీశారు. 

‘నేనే.. నేనే..ను. డాక్టర్‌ను. ఆస్పత్రికి వెళ్తున్నాను.. అడ్డుకుంటారేంటీ?’ అని నంగినంగిగా చెప్పాడు. ‘అబ్బ ఛా.. డాక్టరువా.. ఏ ఆస్పత్రమ్మా, మేమూ వస్తాం పదా చూద్దాం.. ట్రీట్మెంట్ ఎలా చేస్తావో మాకూ చూపించు..’ అని పోలీస్ శైలి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతే, అబ్బాయి లెంపలేసుకున్నాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. నోయిడాలో ఈ నెల 1న జరిగిందీ తతంగం. నకిలీ డాక్టర్ పేరు ఆశుతోశ్. కాన్పూర్ కు చెందిన ఆశుతోష్ నోయిడాలో చదువుకుంటున్నాడు.