రూ.1199కే నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్
Editor | 20 Aug 2019 6:26 AM GMT
ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 105 పేరుతో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఈరోజు విడుదల చేసింది. కేవలం రూ.1199 ధరకే లభించే ఈ ఫోన్‌లో అనేక అధునాతన ఫీచర్లను పొందుపర్చింది. ఈ ఫోన్ లో 2వేల వరకు కాంటాక్టులు సేవ్ చేసుకోవచ్చు. అలాగే 500 ఎస్ఎమ్ఎస్ లను స్టోర్ చేసుకోవచ్చు. నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాంను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ బ్లూ, పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
నోకియా 105 ఫీచర్లు
* 1.77 ఇంచెస్ కలర్ డిస్‌ప్లే,
* ఎఫ్‌ఎం రేడియో,
* ఎల్‌ఈడీ టార్చి లైట్,
* ప్రీ లోడెడ్ గేమ్స్,
* 4ఎంబీ ర్యామ్,
* 4ఎంబీ స్టోరేజ్,
* డ్యుయల్ సిమ్,
* 800 ఎంఏహెచ్ బ్యాటరీ
* 25 రోజుల వరకు స్టాండ్‌బై టైం.
Updated : 20 Aug 2019 7:56 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire