రూ.20,499ల నోకియా ఫోన్ రూ.9,999కే.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ.20,499ల నోకియా ఫోన్ రూ.9,999కే..

November 12, 2019

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా మరో స్మార్ట్‌ఫోన్‌పై ధరను భారీగా తగ్గించింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.9,999కే అమెజాన్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరకు లభించడం మాత్రమే కాకుండా ఈ ఫోన్ కొనుగోలుపై వివిధ బ్యాంకులు ఆఫర్లను ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. హెచ్ఎస్‌బీసీ క్యాష్ బ్యాక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇందులో లభిస్తుంది.

Nokia 6.1 plus.

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు

 

* 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్‌ప్లే,

* యాస్పెక్ట్ రేషియో 19:9,

* స్క్రీన్ రిజల్యూషన్ 2280×1080 పిక్సెల్స్,

* 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,

* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్, 

* 16+5 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా,

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* బ్యాటరీ 3060 ఎంఏహెచ్,

* హైబ్రిడ్ సిమ్ స్లాట్,

* ఫింగర్ ప్రింట్ ఫీచర్.