ఒకప్పుడు మొబైల్ రంగంలో రారాజుగా వెలుగొందిన నోకియా తర్వాత వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకోలేక వెనుకబడింది. కొద్దికాలం గ్యాప్ తర్వాత తనను తాను మెరుగుపరుచుకొని మళ్లీ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ తన ఉనికి చాటుకుంటోంది. అయితే తన ఉన్నతికి తోడ్పడిన ఫీచర్ ఫోన్లను మాత్రం కంపెనీ వదిలిపెట్టలేదు. ఆ ఫోన్లకు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు ఉన్నారు. అలాంటి వారి కోసం కంపెనీ కొత్తగా నోకియా 8210 4g అనే మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే వేరియంట్లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 3999 మాత్రమే. ఇందులో ఉన్న ఫీచర్లను చూస్తే.. రెండు సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. వెనుక వైపు 0.3 ఎంపీ కెమెరా ఉంది. ఎఫ్ఎం, ఎంపీ 3, బ్లూటూత్ కనెక్టివిటీ, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 27 రోజుల బ్యాటరీ స్టాండ్ బైతో వస్తున్న ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీల మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.