ప్రపంచంలో తొలిసారి.. 5 కెమెరాలతో నోకియా ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలో తొలిసారి.. 5 కెమెరాలతో నోకియా ఫోన్

July 10, 2019

NOKIA 9 PUREVIEW

రెండు సిమ్ కార్డులు, నాలుగు సిమ్ కార్డులు, వెనకా ముందు వున్న కెమెరాల ఫోన్లను చూశాం. మరి, ఏకంగా ఐదు కెమెరాలు ఒకే ఫోన్‌కు వుంటే ఎలా ఉంటుంది? చెబుతుంటేనే ఉవ్విళ్లూరిస్తున్న ఈ మాటను నిజం చెయ్యటానికి నోకియా పూనుకుంది. ‘నోకియా 9 ప్యూర్ వ్యూ’ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లోని  బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా 9 ప్యూర్ వ్యూను త్వరలో విడుదల చేస్తున్నట్లు ఫిన్నిష్ బ్రాండ్ హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది.

ఐదు కెమెరాలను క్లిక్‌మనిపించినా ఫోటో ఒక్కటిగా మెర్జ్ అవడం ఈ ఫోన్ ప్రత్యేకత అంటున్నారు. 12 ఎంపీ సామర్థ్యమున్న 5 ఇన్‌ఫ్రా‌రెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. చాలా ప్రత్యేకతలతో వస్తున్న ఈ ఫోన్  ధర రూ.49,999.

నోకియా 9ఫ్యూర్‌ వ్యూ ఫీచర్లు ఇవే.. 

 

  • ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 5.99/6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే

 

  • 3,320/4150 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 3డీ టీఓఎఫ్ సెన్సార్
  • 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
  • 12 ఎంపీ పెంటా రియర్‌ కెమెరా(హైలైట్ ఫీచర్)
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా