Nokia folding phones for Rs. 5 thousand.. Here are the details
mictv telugu

రూ.5వేలకే నోకియా మడత ఫోన్లు..వివరాలు ఇదిగో

August 30, 2022

దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్ ప్రియులకు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియ.. ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి సామాన్యుడు కోనుగోలు చేశాలా, తమ కంపెనీ తాజాగా తయారు చేసిన నోకియ మడత ఫోన్లను తక్కువ ధరకే మార్కెట్లో విక్రయిస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. ఈ నోకియ మడత ఫోన్లకు సంబంధించి, పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను ఈరోజు విడుదల చేసింది.

”నోకియా కంపెనీ మరో క్లాసిక్ ఫోన్‌ను ఆగస్టు 30న భారత మార్కెట్లోకి చేసింది. నోకియా 2660 ఫ్లిప్ (Nokia 2660 Flip)పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉంటుంది. ఈ నోకియా 2660 ఫ్లిప్ కాయ్ ఓఎతో పనిచేస్తుంది. ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఫోన్ తెరిచినప్పుడుపై భాగంలో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, కింద కీబోర్డ్ ఇస్తున్నాం. ఫోన్ మూసినప్పుడు ముందు భాగంలో 1.77 అంగుళాల క్యూక్యూబీజీఏ స్క్రీన్, ఫ్లాష్ లైట్‌తో 0.3 ఎంపీ కెమెరా ఉంటుంది.

ఇక, ఈ ఫోన్ 4జీకి సపోర్ట్ చేస్తుంది. యూనిసాక్ టీ107 ప్రాసెసర్‌ను ఉపయోగించాం. 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.75 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్ సుమారు ఏడు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎస్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ ఫీచర్లున్నాయి. 48 ఎంబీ ర్యామ్/ 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంటు తీసుకొస్తున్నాం. 32 జీబీ మెమొరీ కార్డును సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.