మార్కెట్లోకి నోకియా టీవీలు.. ప్రారంభ ధర రూ. 6,999 - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లోకి నోకియా టీవీలు.. ప్రారంభ ధర రూ. 6,999

November 7, 2019

Smart TV...

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ నుంచి సరికొత్త ఎల్ఈడీ టీవీలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. వివిధ రకాల మోడల్స్‌లో త్వరలోనే ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.  దేశీయ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా ఈ టీవీలను రూపొందిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు టీవీ రంగంలోకి రాడంతో నోకియా కూడా ఆ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 

ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి రాబోతున్న టీవీల ధరలు కూడా ఈ విధంగా ఉన్నాయి.24,32,65  ఇంచుల టీవీలు మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. వీటి ప్రారంభ ధర రూ. 6,999 నుంచి గరిష్ట ధర రూ. 64,999  13,999 గా నిర్ణయించారు. నోకియా స్మార్ట్ టీవీ రంగంలో అడుగు పెట్టడం మంచి పరిణామమని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు. స్మార్ట్ టీవీ రంగంలోనూ తాము మంచి ఫలితాలు సాధిస్తామని నోకియా చెబుతోంది.