టెలికాం పరికరాల రంగంలో వేగవంతమైన విస్తరణ కోసం నోకియా 60యేండ్లలో తొలిసారిగా తన బ్రాండ్ గుర్తింపును కొత్త లోగోను ఆవిష్కరించింది. అసలు ఎందుకు మార్చిందంటే..
ఇటీవలి అప్ డేట్ ల ప్రకారం.. 5జీ టెక్నాలజీ ఫిన్నిష్ తయారీదారు Nokia Oyj దాని చిహ్నాన్ని మార్చింది. ‘స్మార్ట్ ఫోన్ లకు మాకు అనుబంధం ఉంది. కానీ నోకియా అంటే మొబైల్ ఫోన్ బ్రాండ్ అనే కాదు.. ఈ రోజుల్లో మేం వ్యాపార సాంకేతిక సంస్థ ఎదుగాలని అనుకుంటున్నాం’ అంటున్నారు నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్ మార్క్ చెప్పారు.
కారణమేమంటే..
మామూలు మొబైల్ ఫోన్ ల నుంచి చాలా భిన్నమైన నెట్ వర్క్ లు, పారిశ్రామిక డిజిటలైజేషన్ ను బలంగా చెప్పే కొత్త బ్రాండ్ ను పరిచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నోకియా అధినేతలు చెప్పారు. హెచ్ఎమ్ డీ గ్లోబలర్ ఓయ్ బ్రాండ్ తో నోకియా మొబైల్ పరికరాలను విక్రయిస్తూనే ఉంది. 2014లో కంపెనీని కొనుగోలు చేసిన మైక్రోస్టాఫ్ కార్పొరేషన్ పేరు ఉపయోగించడం మానేసింది. లండ్ మార్క్ ప్రకారం నోకియా.. వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్లకు నెట్ వర్క్ పరికరాలను విక్రయించే పరిశ్రమగా అభివృద్ధి చెందింది. నోకియా ప్రైవేట్ 5జీ నెట్ వర్క్ లతో వ్యాపారాలను అందించే తన వ్యాపార విస్తరణను వేగవంతం చేయాలని భావిస్తుంది. అందుకే నోకియా లోగో కొత్త గా ఉండాలని ఆదివారం దీని ఆవిష్కరణ చేశారు.
నోకియా ప్రస్థానం..
నోకియా అనేది ఫిన్నిష్ బహుళజాతి టెలికమ్యూనికేషన్ కంపెనీ. ఇది 1865లో ఫిన్లాండ్ లోని ఎస్పూలో స్థాపించారు. నోకియా 1100 స్మార్ట్ ఫోన్ ల రాకకు ముందు భారతదేశంలో గణనీయమైన వాటాతో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్. ఒకప్పుడు ప్రముఖ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఇతర చైనీస్ బ్రాండ్ ల పెరుగుదలతో నోకియా మార్కెట్ లో పోటీ చేయడంలో విఫలమైంది. దీంతో దాని మార్కెట్ వాటా తగ్గిపోయింది. ఇతరులు స్మార్ట్ ఫోన్స్ ల్లో ఓయస్ కోసం ఆండ్రాయిడ్ వైపు వెళితే, నోకియా విండోస్ తీసుకొచ్చి ప్రయోగం చేసింది, అందులో విఫలమైంది.