చంద్రుడిపై మొబైల్ వాడకం..నోకియా సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రుడిపై మొబైల్ వాడకం..నోకియా సంచలనం

October 19, 2020

nhgfythy5bh

నోకియా.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రాకముందు వరకు ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో రారాజు. ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయే పది ఫోన్లలో ఎనమిది నోకియా ఫోన్లు ఉండేవంటే అతియోశక్తి లేదు. ఫిన్లాండ్‌కి చెందిన ఈ కంపెనీ ఫోన్లు.. క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్‌, దృఢత్వానికి ప్రసిద్ధి. కానీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రావడం, నోకియా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో జతకట్టడంతో దాని పతనం మొదలైంది. ఒక్కసారిగా సేల్స్ పడిపోయాయి. దీంతో కంపెనీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నోకియా బ్రాండ్ హక్కులు హెచ్ఎండీ గ్లోబల్ చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ నోకియా పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్లు, టీవీలను తయారుచేస్తుంది. పాత నోకియా కంపెనీలా క్వాలిటీ ఇస్తున్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించలేకపోతుంది. అయినా సరికొత్త ప్రయోగాలతో తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో నోకియా ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నోకియా అంతరిక్షంలో మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఏకంగా 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి నోకియా ఈ ఒప్పందం చేస్తుంది. ఈ ప్రయోగం సక్సస్ అయితే వైవ్యోమగాములు అంతరిక్షంలో కూడా మొబైల్, వాట్సాప్‌లను వినియోగించనున్నారు. 

ఈ ప్రాజెక్ట్‌ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై రెండు కంపెనీలు సంతకం చేశాయి. నోకియా తొలుత చంద్రునిపై 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి అప్‌గ్రేడ్ చేస్తారు. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలని నాసా ప్రయత్నాలు చేస్తున్నది. 2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని నాసా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది.

చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే నోకియాతో నాసా ఒప్పందం చేసుకుంది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్‌లెస్ ఆపరేషన్‌తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్‌వర్క్‌ను తీసుకోస్తోందని నోకియా పరిశోధక విభాగం బెల్‌ ల్యాబ్స్‌ తెలిపింది. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత,  వాక్యూమ్, రేడియేషన్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్‌ డాలర్ల ఖర్చు చేస్తున్నది. ఈ సాంకేతికను అందించే స్పేస్ ‌ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా నిధులను సమకూర్చుతున్నది.