Nomination episode in Big Boss6
mictv telugu

బిగ్ బాస్‌లో ఈ వారం నామినేషన్స్-ఇంత చెత్త ఏంట్రా బాబూ…

November 2, 2022

సాధారణంగా మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు ఎందుకు ఎలా ఉంటారో చెప్పడం కష్టం. అలానే ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారో కూడా చెప్పడం కష్టమే. కొంత మంది ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. కానీ కొంత మంది ఇంట్లో ఒకరకంగా, బయట ఒక రకంగా ఉంటారు.

జీవితం అంటేనే ఎమోషన్స్ ను మిక్సీలో వేయడం. వాటిని ఎవరు ఎంత వరకు కంట్రోల్ చేసుకుంటారు అనే దానిపైనా వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో ప్రముఖ భాషల్లో ప్రసారమవుతున్న, మోస్ట్ పాపులర్ షో బిగ్ బాస్ థీమ్ ఇదే. కొంత మందిని ఒకే చోట ఉంచి…వారికి ఎటువంటి వ్యాపకం లేకుండా చేసి వారిలోని అసలు ఎమోషన్స్ ను బయటకు తీయడమే ఈ షో ఉద్దేశం. దీని కోసం ఇంటి పనులని, గేమ్ లని, కెప్టెన్సీ టాస్క్ లని, నామినేషన్స్ అని రకరకాలుగా ఆడిస్తాడు బిగ్ బాస్.

తెలుగు బిగ్ బాస్లో ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. మొదలయ్యా చాలా రోజులే అవ్వడంతో ఇప్పటికే సగం మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్్యి వెళ్ళిపోయారు కూడా. ఇక ఉన్నవాళ్ళు రోజుకో రకంగా కొట్టుకుంటున్నారు. కంటెస్టంట్ల ఎంపిక లోపమో లేకపోతే వాళ్ళ తీరే అంతో తెలియదు కానీ ఒక్కరికీ బుర్ర ఉన్నట్టు కనిపించడం లేదు. ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు కూడా చాలా చెత్తగా ఉంటున్నాయి. అయినా కూడా బిగ్ బాస్ హై రేటింగ్స్ తోనే నడుస్తొంది.

58వ వారం, నామినేషన్ ఎపిసోడ్:
…………………………..

బిగ్ బాస్ చెత్తగా ఉందని చెప్పడానికి రీసెంట్ రీజన్….నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్. నామినేట్ చేయాలనుకుంటున్న ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరు చొప్పున కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. మొదట గీతూ స్టార్ చేసింది. ఈమెకు నోరు ఎక్కువ ఆట తక్కువ. ఎప్పడు ఎందుకు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. మాట్లాడితే చాలు ఆట గురించి కాకుండా పర్శనల్ ఎటాక్ లోకి దిగిపోతుంది. నిన్న కూడా అలానే చేసింది….అస్సలు కొత్తదనం ఏమీ లేకుండా. వీళ్ళు బయటకూడా ఇలానే ఉంటారా….లేకపోతే స్క్రిప్టో తెలియదు కానీ.

తరువాత రేవంత్, ఇనయలు కొట్టుకున్నారు. నువ్వేదో అన్నావంటాడు రేవంత్….నాకన్నా ఎక్కువ అంటారు మీరు అంటుంది ఇనయ. ఏంటో వాళ్ళ గోల. కానీ మొత్తం నామినేషన్స్లో ఇనయ్ ఫుల్ టార్గెట్ అయింది. దాదాపుగా అందరూ ఇనయను నామినేషన్ చేశారు. ఆదిరెడ్డి అనే వ్యక్తి అయితే బాగా ఆడుకున్నాడు కూడా. ఆదిరెడ్డి, ఇనయ కొట్టుకుంటుంటే మిగతా జనాలు ఏంటేంటో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. వాటి అర్ధమేమిటో ఆ బిగ్ బాస్ కే తెలియాలి. అసలు వీళ్ళందరీ ఆ నాగార్జున ఎలా భరిస్తున్నాడో ఏంటో.

ఎక్స్ట్రా జబర్దస్త్:
………………..
ఇక ఫైమా….ఈ అమ్మాయి బిగ్ బాస్ని కూడా జబర్దస్త్ అనే అనుకుంటోంది. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోకుండా…తన నోటికొచ్చిన వెటకారం మాట్లాడుతూ రెచ్చిపోతోంది. మరో కంటెస్టంట్ బాలాదిత్య చెప్తున్నా అస్సలు బుర్రకెక్కించుకోవడం లేదు.

మొత్తానికి ఒకరి మీద ఒకరు అర్ధం పర్ధం లేకుండా చాడీలు చెప్పుకుంటూ నామినేషన్స్ వేసుకున్నారు. వీళ్ళతో పోలిస్తే ఏమీ తెలియని చిన్న పిల్లలు చాడీలు కూడా ఎంతో అర్ధవంతంగా కనిపిస్తాయి. మొత్తం నామినేషన్ ఎపిసోడ్ లో రోహిత్ ఒక్కడే సవ్యంగా మాట్లాడినట్టు అనిపించింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు.

మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా:
…………………………..
శ్రీసత్య, ఫైమా, గీతూ, ఆఖరుకి శ్రీహాన్ అందరూ ఓవరాక్షన్ చేసారు. జనాలు ఎలా చూస్తున్నారో కానీ ఒక్కొక్కరినీ చూస్తుంటే మాత్రం కొట్టబుద్ధేసేటట్టు ఉన్నారు. బిగ్ బాస్ గేమ్ థీమే అది అంటే ఏం చేయలేం కానీ….మరీ ఇంతలా ఉండాలా అని మాత్రం అనిపిస్తోంది. శ్రీహాన్, శ్రీ సత్యలు అతి చేష్టలు చిరాకు పుట్టించాయి. ఇనయ క్యారెక్టర్‌ని అయితే రోడ్డుకి లాగేసింది ఫైమా. బాలాదిత్యతో జరిగిన డిస్కషన్స్‌లో అయితే ఫైమా మరోసారి తన స్థాయిని దిగజార్చుకుంది. మొత్తంగా ఈ వారానికి జరిగిన నామినేషన్స్‌లో ఇనయ, గీతు, రేవంత్, ఆదిత్య, శ్రీ సత్య, కీర్తి, ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి, మెరీనా ఈ పది మంది నామినేట్ అయ్యారు.