తమ్ముడి హత్య కేసులో కేఏ పాల్‌పై వారంట్  - MicTv.in - Telugu News
mictv telugu

తమ్ముడి హత్య కేసులో కేఏ పాల్‌పై వారంట్ 

August 19, 2019

Non-bailable warrant against KA Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. అప్పటినుంచి ఈ కేసు మహబూబ్ నగర్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసులో వున్న మిగతా నిందితులు విచారణకు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ పాల్‌ హాజరుకాలేదు. దీంతో పాల్‌కు మహబూబ్ నగర్ కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

2009 జనవరి 30న అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద నిలిపి ఉంచిన కారులో పాల్ సోదరుడు డేవిడ్ రాజు విగత జీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పలువురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలబెట్టారు. అయితే ఈ కేసులో కేఏ పాల్  కూడా ఓ నిందితుడిగా ఉన్నాడు. డేవిడ్ రాజుకు, కేఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కేఏ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సిందిగా పాల్‌కు పలుమార్లు నోటీసులు పంపింది కోర్టు. అయినా ఆయన కేసు విచారణకు తరచూ గైర్హాజర్ అవుతున్నారు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని తెలుస్తోంది.