దబాంగ్ బ్యూటీపై నాన్ బెయిలబుల్ వారెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

దబాంగ్ బ్యూటీపై నాన్ బెయిలబుల్ వారెంట్

March 7, 2022

s

దబాంగ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన సోనాక్షి సిన్హాపై కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జానీ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే… ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్ 2019లో ఢిల్లీలో ఒక ఈవెంట్‌ని నిర్వహిస్తూ దానికి సోనాక్షి సిన్హాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇందుకు గాను రూ. 37 లక్షలను సోనాక్షికి ముందుగానే చెల్లించారు. అయితే ఆ కార్యక్రమానికి సోనాక్షి హాజరుకాలేదు. దాంతో తన డబ్బులు తిరిగిచ్చేయాని ప్రమోద్ అడుగగా హీరోయిన్ మేనేజర్ నిరాకరించాడు. ఈ విషయంపై మాట్లాడడానికి సోనాక్షికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. విసుగెత్తిన ప్రమోద్ ఇక చేసేది లేక ఆమెపై కోర్టులో చీటింగ్ కేసు నమోదు చేశాడు. కేసు విచారణ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు మొరాదాబాద్ కోర్టుకు రావాల్సిందిగా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అయినా సోనాక్షి హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

s