రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ - MicTv.in - Telugu News
mictv telugu

రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

August 30, 2019

renuka chaudhary.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి 30లక్షలు రూపాయలు తీసుకున్నారని రాంజీ నాయక్‌ భార్య కళావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఎన్నికల్లో తన భర్తకు సీటు ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేసిందని రేణుకపై కళావతి చీటింగ్ కేసు పెట్టింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వెళ్లినా రేణుక వాటిని తీసుకోలేదు. కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాలేదు. దీంతో ఖమ్మం జిల్లా రెండవ ఆదనవు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.