నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ.. డోమినోస్‌కు రూ. 9.6లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ.. డోమినోస్‌కు రూ. 9.6లక్షల జరిమానా

May 14, 2022

శాకాహారమే తప్ప మాంసహారం ముట్టని తమ కుటుంబ సభ్యులకు ఓ డెలివరీ భాయ్ మాంసహారంతో ఉన్న పిజ్జాను డెలివరీ చేశాడని, తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టు మెట్లు ఎక్కిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రూర్కీ ప్రాంతంలో శివంగ్ మిట్టల్‌‌ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం శాఖాహారులే. రూ.918తో డొమినోలో వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేశాడు. డెలివరీ అయిన ఆ పిజ్జా స్మెల్ డిఫరెంట్‌గా ఉండటంతో అనుమానం వచ్చి ఓపెన్ చేశాడు. అది నాన్‌వెజ్ పిజ్జా కావడంతో ఆ వాసనకు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడు. కోపంతో రగిలిపోయిన శివంగ్ మిట్టల్‌..‌ అక్టోబర్ 26,2020లో పోలీసులను ఆశ్రయించాడు. అక్కడి పోలీసులు కేసును ఫైల్ చేయకపోవడంతో, 2021లో వినియోగదారుల ఫోరమ్‌ని ఆశ్రయించాడు.

శివంగ్ మిట్టల్‌‌ వాదోపవాదనలు విన్న ధర్మాసనం.. ”డొమినోస్ నిర్లక్ష్యంగా వ్యవరించింది. శివాంగ్ చెల్లించిన రూ.918కు 6 శాతం వడ్డీ చొప్పున రూ.4.65 లక్షలతోపాటు, రూ. 5 లక్షల జరిమానాను (అంటే రూ.9,65,981) విధిస్తూ, ఫోరమ్ చీఫ్ కన్వర్‌సేన్, సభ్యులు అంజనా చద్దా, విపిన్ కుమారులు ఆదేశాలు జారీ చేశారు. డొమినోస్ నిర్లక్ష్యంతో తను శారీరకంగా, మానసికంగానే కాకుండా ఆర్ధికంగా కూడా తీవ్రంగా నష్టపోయినట్లు శివంగ్ మిట్టల్‌ కోర్టుకు తెలుపడంతో డొమినోస్ చర్య ఆ వ్యక్తి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది అని వ్యాఖ్యానించింది.